Apr 22, 2020, 11:09 AM IST
సూర్యాపేటలో మంగళవారం ఒక్కరోజే 26 కరోనాపాజిటివ్ కేసులు నమోదుకావడంలో జిల్లాలో కలకలం మొదలయ్యింది. దీనిపై సీరియస్ అయిన కేసీఆర్ పరిస్థితులను అంచనా వేయాలని ఆదేశాంచారు. ఈ మేరకు బుధవారం కరోనా వ్యాప్తి కి కేరాప్ అడ్రస్ గా మారిన సూర్యాపేటలోని మార్కెట్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, హెల్త్ సెక్రటరీ శాంత కుమారి, హెల్త్ అండ్ మెడికల్ డైరెక్టర్ శ్రీనివాస్, ఎస్పీ భాస్కరన్, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి పరిశీలించారు.