Oct 17, 2022, 1:58 PM IST
హైదరాబాద్ : మాజీ మంత్రి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ నాయకుడికే గాంధీ భవన్ లో ఛేదు అనుభవం ఎదురయ్యింది. ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయడానికి హైదరాబద్ లోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ కు వెళ్లిన పొన్నాల ఎన్నికల సిబ్బందిపై చిర్రుబుర్రులాడారు. 45 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవచేసిన నాయకులకు ఇలాంటి మర్యాదలా... ఏందయ్యా ఇది... ఏం ఏర్పాట్లయ్యా ఇవి అంటూ సిబ్బందిపై పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఓటేయడానికి వస్తే కార్డు జేబులో పెట్టుకుని వెళ్లమంటారా... ఇష్టారాజ్యంగా వ్యవహరించడమేంటని పొన్నాల ఫైర్ అయ్యారు. ఈ సమయంలో అక్కడే వున్న ముల్లురవి తదితర నాయకులు పొన్నలలను సముదాయించి అక్కడినుండి తీసుకెళ్ళారు.