కేటీఆర్ ఇలాకాలో కేసీఆర్ పర్యటన... సర్వాంగసుందరంగా ముస్తాబైన సిరిసిల్ల

Jul 2, 2021, 5:47 PM IST


సిరిసిల్ల: ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా ఇప్పుడు సర్వాంగ సుందరంగా తయారయ్యింది. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సరికొత్త భవనాలు(కలెక్టరేట్, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, మార్కెట్ కమిటీ కార్యాలయం), అధునాతన సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఈనెల 4వ తేదీన ప్రారంభించబోతున్నారు.

తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద దాదాపు 30ఎకరాల స్థలంలో 83కోట్ల రూపాయలతో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మాణం పూర్తి చేశారు. నవతేజ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ నాణ్యతలో రాజీపడకుండా ఇళ్లను నిర్మించారు. ఇళ్లను 1320మందికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సొంతింటి తాళాలు అందించనున్నారు.