జోరు వానలో ఉప్పొంగిన చెరువు దాటుకుంటూ... వరద నీటిలో కేసీఆర్ ప్రయాణం చూడండి...

Jul 17, 2022, 12:15 PM IST

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. శనివారమే వరంగల్ కు చేరుకున్న కేసీఆర్ ఉదయం వరదముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ లో పర్యటిస్తూ ఏరియల్ సర్వే నిర్వహించాల్సి వుంది. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వరంగల్ నుండి రోడ్డు మార్గంలోనే సీఎం ఖమ్మం బయలుదేరార. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ కాన్వాయ్ ఆత్మకూర్ మండలం మీదుగా వెళుతూ కటాక్షపూర్ చెరువు ఉప్పొంగి ప్రవహిస్తుండగా అదే వరదనీటి గుండా వెళ్లింది. ములుగు, ఏటూరునాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకుంటూ భారీ వర్షంలోనే సీఎం కేసీఆర్ కాన్వాయ్ ప్రయాణం కొనసాగింది.