May 25, 2021, 1:10 PM IST
చిలుకూరు: లాక్ డౌన్ సమయంలోనూ కొందరు అర్చకులు, ఆలయ సిబ్బంది బయటకు వచ్చేందుకు అనుమతివ్వాలని చిలుకూరు బాలాజి ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ పోలీసులను కోరారు. ఉదయం సమయంలో వెసులుబాటు కల్పించారు కాబట్టి ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించేందుకు అర్చకులకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదని... అయితే సాయంత్రం సమయంలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదన్నారు. సాయంత్ర పూటకూడా ఆలయాన్ని పూజలు నిర్వహిస్తారు కాబట్టి అత్యవసర సర్వీసుల కింద పరిగణించి అర్చకులకు అనుమతివ్వాలని
సౌందరరాజన్ సూచించారు.