మిషన్ భగీరథ పనులను పరిశీలించిన కేంద్ర బృందం(వీడియో)

May 15, 2019, 2:39 PM IST

వివిధ రాష్ట్రాల్లోని తాగునీటి పథకాల పనితీరును పరిశీలించేందుకు కేంద్ర తాగునీటి విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర తాగునీటి విభాగం డిప్యూటీ సలహాదారు రాజశేఖర్ , మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వెళ్లారు. నాగసాల లో నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. నీటి శుద్ధి ప్రక్రియను చూసారు. అక్కడి నుంచి కేతిరెడ్డి పల్లె , నందారం గ్రామాల్లో, భగీరథ నీటి సరఫరా పై గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకున్నారు. నీటి నాణ్యత, సరఫరా సమయం గురించి అడిగారు. భగీరథ నీళ్లు వచ్చినప్పటి నుంచి తమకు కష్టాలు తీరినాయని గ్రామస్తులు చెప్పారు. భగీరథ నీళ్లు బాగున్నాయన్న గ్రామస్తులు, తాము అవే నీటిని తాగుతున్నామని చెప్పారు.