Sep 18, 2022, 10:57 AM IST
హైదరాబాద్ : సినిమా ప్రెస్ మీట్ కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై హీరోయన్ తమన్నా రక్షణకోసం ఏర్పాటుచేసిన బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. ఓటిటి కోసం తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రెస్ మీట్ ఏర్పాటుచేసారు. ఇందులో పలు ఛానల్స్ రిపోర్టర్లు, కెమెరామెన్లు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తమన్నా వీడియోలు తీస్తుండగా బౌన్సర్లు ఓవరాక్షన్ చేసారు. కెమెరామెన్లను అడ్డుకోవడమే కాదు వారిపై దాడికి దిగారు. దీంతో ప్రెస్ మీట్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.