Jul 28, 2022, 5:23 PM IST
సిరిసిల్ల : ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనూ విద్యార్థుల కష్టాలను పట్టించుకునే నాధుడే లేడంటూ బిజెవైఎం నాయకులు ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి విద్యార్థి విభాగం నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. గొర్రెలతో ర్యాలీగా రోడ్డుపైకి వచ్చిన బిజెవైఎం నాయకులు నిరసన తెలిపారు.