కవితతో బిజెపి మంతనాలా..! చిల్లర రాజకీయాలెందుకు కేసీఆర్: డికె. అరుణ కౌంటర్

Nov 16, 2022, 2:45 PM IST

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకపై బిజెపి తో యుద్దమే అంటున్నారు... కానీ బిజెపి ఎప్పుడో టీఆర్ఎస్ తో యుద్దానికి సిద్దమయ్యిందని ఈ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ కౌంటరిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ను ఓడించే లక్ష్యంతో బిజెపి ముందుకెళుతోందని అన్నారు. టీఆర్ఎస్ అవినీతి, అసమర్థ పాలన, ప్రజలకిచ్చిన హమీలను విస్మరించడాన్ని బిజెపి ఎండగడుతోందన్నారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ను బిజెపి ముచ్చెమటలు పట్టించిందని అరుణ అన్నారు. 

ఇక తన కూతురు కవితను సైతం బిజెపి ఆహ్వానించిందంటూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ కు అరుణ కౌంటరిచ్చారు. కవితను బిజెపిలోకి ఆహ్వానించారని కేసీఆర్ అనడంకంటే చిల్లర రాజకీయం మరోటి వుండదన్నారు. మీలాంటి అవినీతి పరులకు బిజెపి రెడ్ కార్పెట్ వెయ్యబోదన్నారు. మీలాంటి అవినీతి కుటుంబంలోంచి ఎవ్వరినీ ఆహ్వానించరని... ఇలా మాట్లాడి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనడానికి బిజెపి సిద్ధంగా ఉందని డికె. అరుణ తెలిపారు.