అధికారమిచ్చింది నీ అమ్మో, నాన్నో కాదు... చేతగాకపోతే గద్దెదిగు..: సీఎం కేసీఆర్ పై ఈటల ఫైర్

Apr 11, 2022, 6:02 PM IST

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వెంటనే రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బిజెపి నాయకులు ఇదిరాపార్క్ దీక్ష చేపట్టారు.  'వడ్లు కొను- లేదా గద్దె దిగు' నినాదంతో బిజెపి చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మురళీధరన్‌, తెలగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర కీలక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్దాలయినా ఆడతాడని... ఇలాంటి మాటల మరాఠీ గద్దె దించాలని సూచించారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చాక రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటను అమ్ముకునే ఏర్పాటు చేస్తామన్నారు. బడ్జెట్  సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండా చేసారన్నారు. ఈ క్రమంలోనే అధికారం నీ అమ్మ ఇవ్వలేదు... నీ నాన్న ఇవ్వలేదంటూ కేసీఆర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసారు ఈటల రాజేందర్.