Apr 25, 2023, 3:52 PM IST
హుజూరాబాద్ : అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు. వండగళ్ళ వానతో తన నియోజకవర్గ పరిధిలో దెబ్బతిన్న పంట పొలాల్లోకి వెళ్లి నష్టపోయిన రైతులు, వారి కుటుంబాలతో మాట్లాడారు ఈటల. ఈ క్రమంలోనే పెద్దపాపయ్యపల్లికి చెందిన ఓ మహిళ ఆరునెలలు కష్టపడి పండించిన పంటంతా నేలపాలు అయ్యిందంటూ ఈటల ముందు బోరున విలపించింది. ఈమెను ఓదార్చి ధైర్యం చెప్పిన ఈటల నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. వ్యవసాయ అధికారులు కూడా ఒక్క ఎకరం కూడా మిస్ కాకుండా పంట నష్టం అంచనాలు సిద్దంచేయాలని ఈటల సూచించారు.