Jul 16, 2021, 5:37 PM IST
ఇల్లంతకుంట మండలంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు చేస్తానని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా నెలవేర్చకపోవడంతో మంత్రి కేటీఆర్ ఫోటోకు బొట్టుపెట్టి, గాజులు తొడిగి నిరసన తెలిపారు బిజెపి నాయకులు. ఈ హామీ ఇచ్చి 38 నెలలు గడిచినప్పటికీ హామీ నెరవేర్చందుకు ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వద్ద కేటీఆర్ ఫోటోకు 38 గాజులు తగిలించారు బిజెపి నాయకులు. ఇప్పటికైనా వెంటనే ఇచ్చిన హామీని నెలబెట్టుకోవాలని... ,లేనిచో ప్రజాందోళన కార్యక్రమలు తీవ్రతరం చేస్తామని ఇల్లంతకుంట మండల అధ్యక్షులు తిరుపతిరెడ్డి హెచ్చరించారు.