Feb 4, 2021, 12:33 PM IST
కరీంనగర్: చొప్పదండి నియోజకవర్గంలో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అందోళన చేపట్టే అవకాశాలున్నాయన్న అనుమానంతో బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. గంగాధర మండల కేంద్రంలో పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.