Aug 10, 2022, 5:31 PM IST
సిరిసిల్ల : భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ (బుధవారం) మంత్రి కేటీఆర్ ఇలాకాలో బిజెపి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డిపేటలో బిజెపి నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలు చేతబట్టి బైక్ ర్యాలీ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల బిజెపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణా ఈ బైక్ ర్యాలీని ప్రారంభించారు.