Jun 26, 2022, 2:45 PM IST
హైదరాబాద్ : అది హైదరాబాద్ లోనే అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్ ఉస్మానియా. తెలుగు రాష్ట్రాల నుండే కాదు పక్కనే వున్న కర్ణాటక, మహారాష్ట్ర నుండి నిత్యం వైద్యంకోసం వందలాదిమంది రోగులు వస్తుంటారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో నిత్యం రద్దీగా వుంటుంది. ఇలా ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్లేచోట ప్రాణాలు తీసే పాము కలకలం రేపింది. ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించిన ఓల్డ్ బిల్డింగ్ లో ఓ పాము అందరినీ కంగారు పెట్టించింది. అయితే ఎలాంటి ప్రమాదం జరక్కముందే స్నేక్ సొసైటీ ప్రతినిధులు చాకచక్యంగా పామును పట్టేసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.