Apr 22, 2020, 1:57 PM IST
కర్నూలు జిల్లాలో కరోనా పెరగడానికి కారణం హఫీజ్ ఖాన్ అని అందరికీ తెలుసు. జిల్లాలో కేసులు పెరగడానికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అని టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. ప్రజల ప్రాణాల కోసం వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇవేమీ పట్టని ఈ ప్రభుత్వం కళ్లు మూసుకుని రాజకీయం చేస్తోంది. అనంతపురంలో ఏఎస్ ఐ చనిపోయాడు. ఎమ్మార్వో కు కరోనా వచ్చింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ట్రాక్టర్లతో ర్యాలీ తీశాడు దీనివల్ల 8 మంది ప్రభుత్వ అధికారులకు కరోనా వచ్చింది.. అంటూ జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారామె.