టాలీవుడ్ స్టార్ కృష్ణకు జగన్ నివాళి... మహేష్ కు ధైర్యంచెప్పిన సీఎం

Nov 16, 2022, 12:53 PM IST

హైదరాబాద్ : సూపర్ స్టార్ కృష్ణ పార్థీవదేహానికి ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. నిన్న(మంగళవారం) ఉదయం కృష్ణ మృతివార్త తెలిసినవెంటనే సోషల్ మీడియా ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన జగన్ ఇవాళ(బుధవారం) పార్దీవదేహానికి నివాళి అర్పించారు. హైదరాబాద్ పద్మాలయ స్టూడియోకు చేరుకున్న జగన్ కు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు లోపలకు తీసుకెళ్లారు. కృష్ణ పార్థీవదేహంపై పుష్ఫగుచ్చం వుంచి దండంపెట్టుకుని నివాళులర్పించారు. అనంతరం మహేష్ బాబుతో పాటు కృష్ణ పిల్లలు, ఘట్టమనేని కుటుంబసభ్యులను సీఎం జగన్ పరామర్శించారు.