Apr 10, 2020, 4:30 PM IST
మల్కాజిగిరిలోని అనురాగ్ స్వచ్ఛంద సంస్థ లాక్ డౌన్ నేపధ్యంలో 200మంది వలసకూలీలు, పేదవారికి ముడిసరుకులు పంపిణీ చేసింది. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ సి.ఐ నరసింహ స్వామి ఆధ్వర్యములో అంబేద్కర్ నగర్ లోని 200 మందికి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశామని అనురాగ్ నిర్వాహకులు డా. రామ్ తెలిపారు. లాక్ డౌన్ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమ కార్యక్రమాలు ఇంకా విస్తరిస్తామని దీనికోసం జిల్లా మేజిస్ట్రేటు, కమిషనర్లను సంప్రదిస్తామన తెలిపారు.