Nov 25, 2020, 1:58 PM IST
ప్రియురాలు అఖిల మోసం చేసిందని కెనడాలో ఈ నెల 14న నైట్రోజన్ గ్యాస్ తో ఆత్మహత్య చేసుకున్న ప్రణయ్ భౌతిక కాయం 11 రోజుల తర్వాత అనంతపురం చేరుకుంది. ప్రణయ్ మృతదేహాన్ని చూసి, అమ్మాయికోసం చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రణయ్ స్వగ్రామం గడ్డం నాగేపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రణయ్ ఆత్మహత్య ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.