Apr 24, 2020, 4:17 PM IST
గుడుంబా తయారీలో పటిక బదులు ప్రమాదకరమైన అమ్మోనియా వాడుతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. పెద్దపల్లి సాయిరాం ఫెర్టిలైజర్ నుండి సుల్తానాబాద్ తరలిస్తున్న 39 అమ్మోనియా బ్యాగ్ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి శివారులో ట్రాలీలో రవాణా చేస్తున్న 39 బ్యాగులను, ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వాటికి కిలోల చొప్పున అమ్ముతామని వారు చెబుతున్నారు. గుడుంబా తయారీలో వాడతారని తెలియదని బుకాయిస్తున్నారు.