Dec 27, 2019, 12:06 PM IST
సంపూర్ణ సూర్య గ్రహణం సందర్బంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు వినూత్న ఆచారాన్ని పాటించారు. పలు ప్రాంతాల్లో గ్రహణం సందర్భంగా కంచు పళ్ళెంలో పసుపు నీరు పోసి రోకలి బండను నిలబెట్టారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో గ్రహణ సమయంలో ఓ ఇంటి ఆవరణలో పసుపు నీళ్లతో నిండిన పళ్లెం ఉంచి దానిలో రోకళ్లను నిలబెట్టి పూజలు చేశారు. సాధారణంగా రోకలి పళ్లెంలో నిలబడదు. అయితే గ్రహణ సమయంలో మాత్రమే నిలబడుతుందని గ్రామీణుల విశ్వాసం. గ్రహణం విడిచిన అనంతరం రోకలి దానంతట అదే కింద పడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.