Apr 24, 2020, 5:00 PM IST
ఎఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పెద్ద మనసు చాటుకున్నారు. పదిహేను లక్షల విలువైన 2818 పీపీఈ కిట్లను పోలీసులు, ఆశావర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లకు అందించనున్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి, భోలక్ పూర్, షేక్ పేట్, ఎర్రగడ్డ నియోజక వర్గాల్లోని వారికి వీటిని పంపిణీ చేస్తారు. ఇందులో పీపీఈ కిట్లు, మినీ కిట్లు ఉన్నాయి. వీటిని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కు అందజేశారు.