సంగారెడ్డి జిల్లా అమీన్ పురాలోని సైనిక్ పురి కాలనీకి చెందిన ఏడేళ్ల బాబుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ బాబు తండ్రి గత నెల స్విట్జర్లాండ్ నుండి హైదరాబాద్ కు వచ్చాడు. అతను హైదరాబాద్ లో 14 రోజుల క్వారంటైన్ తరువాత ఇంటికి వెళ్లాడు. నాలుగు రోజుల తరువాత కొడుకుకు దగ్గు రావడంతో పరీక్షలు చేపిస్తే పాజిటివ్ వచ్చింది. దీంతో హైఅలర్ట్ ప్రకటించారు.