పెద్దపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం... ఇద్దరు ఎంపీ వాసులు మృతి, ఐదుగురికి గాయాలు

Apr 24, 2022, 12:39 PM IST

కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో దూసుకెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న డిసిఎం వ్యాన్ ను ఢీకొట్టింది. పెద్దకల్వల శివారులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మధ్యప్రదేశ్ కు చెందిన చైత్రముఖి (25), హులాస్ రామ్ (40) గా గుర్తించారు.  హేమేంద్ర సహరి, రాహుల్ సత్పూరి, దుక్రాం తికం, నాగేంద్ర సహారి తో పాటు డ్రైవర్ కరణ్ గాయపడ్డారు. గాయపడ్డ వారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.