మయాంక్ అద్భుత ఇన్నింగ్స్:  టీమిండియాలో స్థానం సుస్థిరం

27, Sep 2020, 10:15 PM

IPL 2020లో మరోసారి భారీ స్కోరు నమోదుచేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది పంజాబ్. టాస్ గెలిచి పంజాబ్‌కి బ్యాటింగ్ అప్పగించిన స్టీవ్ స్మిత్, కింగ్స్ ఎలెవన్ ఓపెనర్ల బ్యాటింగ్ చూసిన తర్వాత తాను తీసుకున్న నిర్ణయానికి బాధపడి ఉండొచ్చు. మొదటి ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్... ఆ తర్వాత గేరు మార్చి జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లారు.