Jun 14, 2022, 2:28 PM IST
విశాఖపట్నంలో క్రికెట్ మానియా మొదలయ్యింది. భారత్- సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20సీరిస్ లో భాగంగా ఇవాళ (మంగళవారం) మూడో టీ20కి విశాఖ వేదికకానుంది. దీంతో విశాఖ స్టేడియం వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే సర్వం సిద్దం చేసారు అధికారులు. విశాఖలో జరిగే టీ20లో సౌతాఫ్రికాపై మొదటి విజయం సాధించి బోణీ కొట్టడమే కాదు సీరిస్ పై ఆశలు సజీవంగా వుంచుకోవాలని టీమిండియా చూస్తోంది. మరోవైపు ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న విండీస్ హ్యాట్రిక్ విజయం సాధించి ఐదు మ్యాచ్ ల సీరిస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో టీమిండియాకు మద్దతుగా నిలిచేందుకు క్రికెట్ ప్రియులు సిద్దమయ్యారు.