Jun 3, 2022, 11:00 AM IST
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ పెంపుడు సిద్ధాంతాన్ని తయారు చేసుకుని దాన్నే విశ్వసిస్తున్నట్లు కనిపిస్తున్నారు. రెడ్లు నాయకత్వం వహిస్తేనే పార్టీలు అధికారంలోకి వస్తాయనేది ఆయన పెంపుడు సిద్ధాంతం. అదే విషయాన్ని బహిరంగంగా చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం చెలరేగింది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించే కాంగ్రెసులోని ఓ వర్గం ఆయనను వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నాయి. ఆ వ్యాఖ్యల ద్వారా ఆయన తన రాజకీయ అపరిపక్వతను చాటుకున్నారు. ఒక పార్టీ రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యల ద్వారా తనను తానే కుదించుకునే స్థాయికి చేరుకున్నారు. ఆయన మాటల ఆంతర్యమేమిటో, ఆయన అపరిపక్వత ఏమిటో చూద్దాం.