RTC Strike Effect : ఆర్టీసీ ప్రభావం...విదేశాల్లో టీఆర్ఎస్ నేత వినోద్ కు చేదు అనుభవం

Nov 11, 2019, 12:47 PM IST

ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా ఎన్నారైలు గళమెత్తారు. అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి హాజరైన ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ను ఎన్నారైలు నిలదీశారు. ఆర్టీసీ కార్మికులకు మా మద్దతు అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. TRS ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.