Aug 28, 2022, 9:54 PM IST
ఈ రోజు నోయిడాలోని సూపర్ టెక్ ట్విన్ టవర్స్‌ను కూల్చేశారు. నోయిడాలోని సెక్టార్ 93ఏలోని ఈ టవర్స్‌ను ఆధునిక సాంకేతికతతో నేలకూల్చారు. పొరుగునే ఉన్న ఇతర అపార్ట్‌మెంట్లకు ఎంతమాత్రం నష్టం వాటిల్లకుండా కూల్చారు. ఈ టవర్స్ కూల్చడానికి సుమారు 3,500 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. ఈ కూల్చివేత కోసం టవర్స్ చుట్టుపక్కల నివాసాలను ఖాళీ చేయించారు. అక్కడి నివాసాల్లోని ప్రజలను పక్కా ప్రణాళికలతో తరలించారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్పషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పడింది. ఆ రెసిడెన్సీ నివాసులూ బృందాలుగా ఏర్పడి మిగతా అందరికీ అవగాహన కల్పించే పనిలో నిమగ్నం అయ్యారు. సుమారు నెల రోజులుగా వారంతా ఈ పనిలో నిమగ్నం అయ్యారు. కూల్చివేత ప్రక్రియపై ప్రజలు ఆసక్తిగా వుండటంతో ఈరోజు టీవీలు, ఫోన్‌లకు అతుక్కుపోయారు. ఇక కొందరు డ్రోన్ ద్వారా వీడియో తీశారు.