మహనీయుడి జీవితంలో నేర్చుకోదగిన పాఠాలు ఎన్నో... (వీడియో)

Oct 15, 2019, 9:11 PM IST

భారత మాజీ రాష్ట్రపతి అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ కేవలం మనదేశానికి మాత్రమే కాదు ప్రపంచానికే ఆదర్శనీయుడు. ఈ రోజు ఆ మహనీయుడి 88వ జయంతి సందర్భంగా ఆయన జీవితంలో మీకు తెలియని ఐదు విశేషాలు చూద్దాం.

1.    అబ్దుల్ కలాం చిన్నప్పటినుండే చాలా కష్టజీవి. ఐదేళ్ల చిరుప్రాయంలోనో తండ్రికి సాయంగా న్యూస్ పేపర్లు అమ్మేవాడు. ఈ పని స్కూలు అయిపోయిన తరువాత సాయంకాలం వేళల్లో చేసేవాడట.
2.    భారతవైమానిక దళంలో యుద్ధవిమాన పైలట్ అయ్యే అవకాశం కొద్దిలో తప్పిపోయింది. లిస్టులో అబ్దుల్ కలాం పేరు తొమ్మిదో స్థానంలో ఉంది. అక్కడ ఎనిమిది మందికే  ఛాన్స్ ఉంది. కాబట్టి అబ్దుల్ కలాం తప్ప ముందున్న ఎనిమిది మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 
3.    అబ్దుల్ కలాం స్విట్జర్లాండ్ కి వెళ్లిన రోజును ఆ దేశంలో సైన్స్ డేగా వ్యవహరిస్తున్నారు. అబ్దుల్ కలాం చనిపోయిన తరువాత ఆయనకు ఇచ్చే నివాళిగా స్విస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికీ ఇది ఇక్కడ అమల్లో ఉంది.
4.    కలాం మంచి కళాకారుడు కూడా. తమిళంలో మంచి కవిత్వం రాశారాయన. అంతేకాదు అద్భుతంగా వీణ వాయించగలడు కూడా.
5.    కలాం తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ లో కేవలం 38మందిని మాత్రమే ఫాలో అయ్యేవారు. అలా కలాం ఫాలో అయ్యే లిస్టులో ఉన్న ఒకే ఒక్క క్రికెటర్ మన వివిఎస్ లక్ష్మణ్.