జార్ఖండ్ చేరుకున్న సీఎం కేసీఆర్... రాంచీ విమానాశ్రయం నుండి నేరుగా అక్కడికే...

Mar 4, 2022, 2:43 PM IST

రాంచీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకున్నారు. న్యూడిల్లీ నుండి రాంచీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా  బిర్సా ముండా చౌక్ కు చేరుకున్నారు. అక్కడ  స్వాతంత్రోద్యమ నాయకుడు, గిరిజన ఉద్యమ నేత, ఝార్ఖండ్ ప్రజల ఆరాధ్య నాయకుడయిన భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. అక్కడి నుండి రాష్ట్ర సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారికి నివాసానికి చేరుకోనున్నారు.  సీఎం కేసీఆర్ వెంట  మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్, తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తదితరులు వున్నారు. కాసేపట్లో   హేమంత్‌ సోరెన్‌తో కలిసి గల్వాన్ లోయలో వీరమరణం పొందిన జార్ఖండ్ కు చెందిన ఇద్దరు భారత జవాన్ల కుటుంబాలను కలుసుకోనున్న కేసీఆర్ గతంలో ప్రకటించినట్లుగా రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నారు.