Aug 11, 2022, 1:33 PM IST
న్యూడిల్లీ : ఆడపడుచులు తమ సోదరులపై ప్రేమను వ్యక్తపరుస్తూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండగ రాఖీ. సోదరులు కూడా తమ తోబుట్టువులపై ఆప్యాయతను పంచేది కూడా ఇదే పండగ. ఇలాంటి రాఖీ పండగను పురస్కరించుకుని యావత్ దేశానికే పెద్దన్నలాంటి ప్రధాని నరేంద్ర మోదీకి చిన్నారులు రాఖీ కట్టారు. ప్రధాని అధికారిక నివాసంలో పనిచేసే స్వీపర్స్, డ్రైవర్స్, తోటమాలి తదితరుల పిల్లలు మోదీకి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలా కల్మశం లేని చిన్నారుల చిరునవ్వుల మధ్య ప్రధాని కూడా హాయిగా నవ్వుతూ కనిపించారు. నిరుపేదల ఆడబిడ్డలకు తానే పెద్దన్నను అనే సందేశాన్నిచ్చేలా పీఎం మోదీ రక్షాబంధన్ పండగను జరుపుకున్నారు.