Oct 13, 2022, 10:23 AM IST
న్యూడిల్లీ : తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత్ రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే డిల్లీలో బిఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటుచేయడమే కాదు సకల సౌకర్యాలతో కేంద్ర కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దేశ రాజధానిలోనే వున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వసంతవిహార్ లో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి పనులు ఎలా సాగుతున్నాయి, ఎంతవరకు పూర్తయ్యాయో తదితర వివరాలు తెలుసుకున్న కేసీఆర్ పలు సలహాలు, సూచనలిచ్చారు. తెలంగాణ సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, దివకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవించంద్ర, ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ తదితరులు వున్నారు.