Jul 25, 2024, 10:05 PM IST
Kargil Vijay Diwas exclusive: 1999లో కార్గిల్ యుద్ధం కథను ఛేదించిన అనుభవజ్ఞుడైన జర్నలిస్ట్ గులాం నబీ జియా ఏషియానెట్ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అప్పటి సంఘర్షణ పరిస్థితులను వివరించారు. ఇంటర్నెట్ లేకపోవడంతో కీలక సమాచారం కోసం ఫోన్ కాల్స్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు.
"యుద్ధం అకస్మాత్తుగా జరిగింది. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు' అని జియా గుర్తు చేసుకున్నారు. ద్రాస్ పర్వతాలపై ఆరుగురు మిలిటెంట్లు సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. ఆ తర్వాత 24 గంటల్లో అది 50కి చేరింది. మూడో రోజు యుద్ధాన్ని ప్రకటించారని తెలిపారు. భారత సైన్యం మరణాలకు కారణం శత్రువుల తుపాకీ గుండ్లు కాదనీ, ప్రమాదకరమైన భూభాగమని జియా పేర్కొన్నారు. శత్రువుల తూటాల వల్లకాదు.. మిలిటెంట్లు పర్వతాల నుంచి కిందకు విసిరే రాళ్లు, మంచు కారణంగా ఎక్కువగా నష్టపోయామని చెప్పారు.