Jul 25, 2024, 10:04 PM IST
Kargil Vijay Diwas exclusive: ఏషియానెట్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్థానిక హీరో తాషి నామ్‌గ్యాల్ 1999లో కార్గిల్ యుద్ధంలో తాను పోషించిన కీలక పాత్రను వివరించారు. నామ్‌గ్యాల్ అప్పటి తీవ్రమైన యుద్ధ సంఘర్షణను వివరిస్తూ.. "నేను మంచు కురుస్తున్నప్పుడు 5 నుండి 6 మంది శత్రువులను చూశాను, రాళ్లు విసురుతున్నారు. నేను మా గ్రామానికి తిరిగి వచ్చాను. అందుకు భిన్నంగా మా గ్రామంలో వర్షం కురుస్తోంది. నా దగ్గర హవాల్దార్ బల్బీందర్ సింగ్‌తో సహా ఐదుగురు సైనికులు మాత్రమే ఉన్నారు. చాలా మంది శత్రువులు మనపై రాళ్లతో దాడి చేస్తున్నారని నేను అతనికి తెలియజేశాను. నాతో ఉన్న సైనికుల్లో ఒకరి పేరు నందూరాం" అని పేర్కొన్నారు.
కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులకు తాను, అతని తోటి గ్రామస్తులు అందించిన మద్దతు గురించి నామ్‌గ్యాల్ మాట్లాడుతూ.. "మేము దళాలకు అవసరమైన రేషన్లు, అవసరమైన నిత్యావసరాలను సేకరించాము. జూలై నెలాఖరులో యుద్ధం ముగిసే వరకు మేము వారికి మూడు నెలల పాటు రాత్రింబవళ్ళు సహాయం చేసాం" అని గుర్తు చేసుకున్నారు. "మేము రోజుకు 3-4 సార్లు లోడ్లు మోయవలసి వచ్చింది. ఏదేమైనా భారత సైన్యానికి ధన్యవాదాలు.. ఎందుకంటే ఇప్పుడు మనం మెరుగైన సౌకర్యాలను అందుకున్నాం.." అని తెలిపారు. కాగా, నామ్‌గ్యాల్ గ్రామం గార్కోన్, బటాలిక్ సెక్టార్‌లో ఉంది. ఇది కార్గిల్ యుద్ధ సమయంలో కీలకమైన ప్రాంతంగా ఉంది. యుద్ధ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే స్థానిక హీరోల ధైర్యం దేశరక్షన పట్ల వారి నిబద్ధతను నొక్కి చెబుతుంది.