Jul 11, 2022, 1:48 PM IST
దేశ స్వతంత్రం ఉద్యమంలో ఎంతో మంది మహిళలు కూడా తమ జీవితాలను త్యాగం చేశారు. బ్రిటీష్ పాలకులను తరిమివేయడానికి అడవి బాట పట్టి, ఆయుధాలు భుజాన వేసుకొని పోరాడిన ఎందరో ధీర వనితలు ఉన్నారు. అందులో కెప్టెన్ లక్ష్మి కూడా ఒకరు. ఆమె కేరళలోని భూస్వాముల కుటుంబంలో జన్మించారు. మద్రాసులో సంపన్న బారిస్టర్ కుమార్తెగా యుక్త వయస్సులో విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. చదువులో చురుకుగా ఉండే వారు. ఆకట్టుకునే లుక్స్ తో ఉండే ఆమె డాక్టర్ పట్టా పొందారు. అయినా తన మాతృభూమిని బ్రిటీష్ బానిస సంకెళ్ల నుంచి విడిపించడానికి ఓ సైనికురాలిగా మారింది. అడవి, కొండలు, జైలులో సాహసోపేతమైన, కఠినమైన జీవితాన్ని ఎంచుకుంది. ఇదే లక్షి అసాధారణ కథ.లక్ష్మి స్వాతంత్ర సమరయోధుడు, మద్రాసులో ఉన్నత న్యాయవాది అయిన అమ్ము స్వామినాథన్ రెండో కుమార్తె. మెడిసిన్‌లో పట్టా పొందిన తర్వాత వివాహం విఫలమవడంతో 26 ఏళ్ల వయసులో సింగపూర్‌కు వెళ్లింది. అక్కడ నేతాజీ సుభాష్ బోస్ కు చెందిన ఇండియన్ నేషనల్ ఆర్మీ నాయకులను కలుసుకున్నారు. వారి కార్యకలాపాలకు ఆకర్షితులయ్యారు. INA, జపాన్ ల ఉమ్మడి శత్రువు అయిన బ్రిటన్‌కు వ్యతిరేకంగా జరిగిన 2వ ప్రపంచ యుద్ధంలో ఆమె జపనీస్ సైన్యంతో పొత్త పెట్టుకుంది. రెండో ప్రపంచ యుద్ధంలో గాయపడిన జపనీస్ సైనికులకు అండగా నిలిచింది. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోష్ సింగపూర్‌కు వచ్చినప్పుడు లక్ష్మిని కలుసుకున్నారు. అదే సమయంలో ఐఎన్‌ఏలో చేరాలనే తన కోరికను ఆమె వ్యక్తం చేశారు. దీంతో ఆమెను ఝాన్సీ రాణి రెజిమెంట్ పేరుతో కొత్తగా ఏర్పడిన ఆల్-ఉమెన్ బ్రిగేడ్‌కు అధిపతిగా నియమించారు. సింగపూర్, మలేషియాలోని భారతీయుల కుమార్తెలు ఈ రెజిమెంట్‌లో చేరారు. వారికి ఆయుధాలు, పోరాటాలలో ఆమె శిక్షణ ఇచ్చారు. ఇదే సమయంలో సింగపూర్‌లో INA టాప్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ప్రేమ్ సెహగల్‌తో ప్రేమలో పడింది. 1944 డిసెంబర్ లో కెప్టెన్ లక్ష్మీ రాణి రెజిమెంట్ కూడా కల్ సెహగల్ నేతృత్వంలోని INA దళాలతో పాటు జపాన్ సైన్యంతో బర్మాకు వెళ్లింది. కానీ అక్కడ జపాన్ సైన్యం మిత్రరాజ్యాల దళాల నుండి పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొంది. దీంతో వారందిరినీ బ్రిటీష్ సైన్యం బంధించింది. ఇందులో సెహగల్, లక్ష్మి వంటి INA సైనికులు ఉన్నారు.భారత దేశానికి స్వాతంత్రం తర్వాత లక్ష్మి CPI(M)లో చేరారు. 2002లో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. అలాగే ఉమ్మడి ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు చేపట్టారు. బంగ్లాదేశ్ యుద్ధం భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో కూడా ఆమె సహాయ శిబిరాలకు నాయకత్వం వహించారు. ఆమె మహిళల హక్కుల కోసం, అందాల పోటీలకు వ్యతిరేకంగా పోరాడారు. మొన్నటి వరకు కెప్టెన్ లక్ష్మి కాన్పూర్‌లో పేదలకు ఉచిత వైద్యం అందించే క్లినిక్ నడిపించారు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయిన కెప్టెన్ లక్ష్మి తన 97వ యేట 2012 లో మృతి చెందారు.