Sep 22, 2020, 9:46 PM IST
భారత వైమానిక దళంలోని గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్ ద్వారా సేవలు అందించనున్న రఫేల్ యుద్ధ విమానాలను ఓ మహిళా పైలట్ నడపనున్నారు. అందుకు సంబంధించి ఆమె శిక్షణ పొందుతున్నారని సోమవారం వైమానిక దళ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఆమె మిగ్ 21 యుద్ధ విమానాలను నడిపించారని తెలిపారు. ప్రస్తుతం వైమానిక దళంలో మహిళలు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వారిలో 10 మంది యుద్ధ విమాన పైలట్లు, 18 మంది నావిగేటర్లు ఉన్నారు. మొత్తంగా 1875 మంది మహిళా అధికారులు ఉన్నారు.