ఆవు నెయ్యి వర్సెస్ గేదె నెయ్యి ... రెంటిలో ఏది బెస్ట్ ..?

Jun 18, 2022, 5:03 PM IST

నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మార్కెట్ లో మనకు రెండు రకాల నెయ్యి లభిస్తుంది. ఒకటి గేదె నెయ్యి, ఇంకోటి ఆవు నెయి. మరి ఇందులో ఏ నెయ్యిని తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటుంటే ఎంత రుచి ఉంటుందో కదా.. రుచిలోనే కాదు దీనిని సరైన పరిమాణంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ కారణంగానే ఆహారంలో నెయ్యిని చేర్చుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. ఆయుర్వేదంలో (Ayurveda) నెయ్యిని శక్తివంతమైన ఆహారంగా భావిస్తారు. ఈ నెయ్యిని మన దేశంలో పప్పు, కిచిడీ నుంచి హల్వా మరియు చపాతీ వరకు ప్రతిదాంట్లో వాడుతుంటారు.  శుద్ధి చేసిన నూనెల కంటే నెయ్యితో వండటం వల్ల ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.