Ayodhya Ram Mandir : సరయూ తీరంలో హారతి కార్యక్రమానికి పోటెత్తిన భక్తులు (వీడియో)

Jan 2, 2024, 7:36 PM IST

శ్రీరామ జన్మభూమి అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏషియానెట్ బృందం అక్కడికి వెళ్లి సన్నాహాలను పరిశీలించింది. ఈ క్రమంలో సరయూ నది ఒడ్డున ఒక అద్భుతమైన దృశ్యం సాక్షాత్కరించింది. పెద్ద సంఖ్యలో భక్తులు సరయూ నది ఒడ్డుకు చేరుకుని హారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ ప్రదేశంలో దీపాలను దానం చేయడంతో పాటు పవిత్ర జలాన్ని కూడా ఇంటికి తీసుకెళ్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం త్వరగా పూర్తయి శ్రీరాముని దర్శనం చేసుకోవాలన్నది భక్తుల కోరిక.