Jul 18, 2022, 10:03 AM IST
మన పక్కనున్న ద్వీప దేశం శ్రీలంక చరిత్రలో మునుపెన్నడూ చూడని తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని చవిచూస్తోంది. రాజపక్సే నిష్క్రమణ కోరుతూ నిరసనకారులు ఆఖరికి అధ్యక్ష భవనాన్ని కూడా ఆధీనంలోకి తీసుకొని ఎలా నిరసన తెలిపారో మనము చూసిందే..! ఇక గోటబయ రాజీనామా చేసిన తరువాత శ్రీలంక పయనం ఎటువైపు అనే ప్రశ్న అందరి మనసుల్లోనూ మెదులుతూనే ఉంది..! ఈ నేపథ్యంలో ఏషియానెట్ న్యూస్... మాజీ దౌత్యవేత్త, దక్షిణాసియా రాజకీయాల మీద అపారమైన పట్టున్న వేణు రాజమోని తో ఈ విషయానికి సంబంధించి ముచ్చటించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఏషియా నెట్ న్యూస్ నిర్వహిస్తున్న సంవాద్ సిరీస్ లో భాగంగా ఈ మూడవ ఎపిసోడ్ ని మీకు అందిస్తున్నాము.