Apr 30, 2020, 4:25 PM IST
ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ కుర్రాడు సరుకుల కోసమని బైటికి వెళ్లి ఏకంగా పెళ్లి చేసుకుని భార్యను వెంటబెట్టుకుని వచ్చాడు. అది చూసిన అతని తల్లి షాక్ అయింది. రెండు నెలలుగా బైటికి రాని ఆమె కొడుకు చేసిన పనితో పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కింది. కొడుకు చేసుకున్నది పెళ్లో కాదో తెలియదని, ఆమెను ఇంట్లోకి రానిచ్చేది లేదని చెబుతోంది. వీరికి పెళ్లి చేసిన పురోహితుడు కూడా లాక్ డౌన్ తరువాతే సర్టిఫికెట్ ఇస్తా అంటున్నాడు.