అమర్ నాథ్ యాత్ర పున:ప్రారంభం...దర్శనానికి భారీగా తరలిన భక్తులు

Jul 11, 2022, 12:35 PM IST

అమర్ నాథ్ : భారీ వర్షాలు, వరదలతో ప్రమాదం చోటుచేసుకోవడంతో తాత్కాలికంగా వాయిదాపడిన అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమయ్యింది. పంచతరణి మార్గంలో భక్తులను అమర్ నాథ్ లోని పవిత్ర గుహకు వెళ్లానికి అనుమతిస్తున్నారు. బల్తాల్ మార్గంలో భక్తులను అనుమతించడం లేదు. వివిధ బేస్ క్యాంపుల్లో తలదాచుకున్న దాదాపు 7వేల మంది భక్తులు వాతావరణం అనుకూలంగా మారడంతో అమర్ నాథుడి దర్శనానికి బయలుదేరారు.