Nov 30, 2019, 2:58 PM IST
కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన ఢిల్లీలో అన్ని రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖ మంత్రుల సమావేశం జరిగింది.మహారాష్ట్ర సదన్ లో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. కంపా నిధుల వినియోగం, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది.