Sep 18, 2019, 8:25 PM IST
అస్సాం రాష్ట్రంలో నివసిస్తున్న వారిలో 19లక్షల మంది భారతీయులు కాదని నేషనల్ రిజిస్టార్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) ఇటీవల ఓ జాబితాను విడుదల చేసింది. అంతేకాదు వారికి ఉన్న పౌరసత్వాన్ని కూడా రద్దు చేసింది. కాగా... వారంతా పొట్టకూటి కోసం బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వలస వచ్చినవారుగా అధికారులు గుర్తించారు.