Election videos

మోడీ, రాహుల్ సెగ్మెంట్లలో వేయ్యేసి నామినేషన్లు: కవిత (వీడియో)

Mar 20, 2019, 11:27 AM IST

రైతులకు ఏమీచేయని తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు తీరు మార్చుకోకపోతే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేసే అమేథీ, వారణాసి నియోజకవర్గాల్లోనూ వెయ్యి మంది రైతులతో నామినేషన్లు వేయిస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో మంగళవారం రాత్రి నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నాయకులు అమాయక గంగి గోవుల్లాంటి రైతుల మధ్య తోడేళ్లలా దూరి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యల పరిష్కారం పట్ల టీఆర్‌ఎస్‌కు మాత్రమే చిత్తశుద్ధి ఉన్నదని పేర్కొన్నారు.

 

టీఆర్‌ఎస్.. తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, తెలంగాణ రైతు సమితి అని అభివర్ణించారు. రైతులకు 24గంటల కరెంటు, నీటి తీరువా మాఫీ, రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను రైతులకు అందిస్తున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమే అన్నారు. అమ్మ తర్వాత అన్నం పెట్టేది రైతన్న మాత్రమేనన్నారు.