video news : తెలుగులో విశ్లేషకుల కొరత ఉంది: నగ్నముని ఆసక్తికర వ్యాఖ్యలు

Nov 15, 2019, 3:04 PM IST

ప్రజల్లో పేరుకు పోయిన అసహనాన్ని, కోపాన్నీ ప్రజల భాషలోనే చెప్పిన దిగంబర కవిత్వానికి ఆధ్యుడు నగ్నముని.  అతను విరసం నుండి బయటకు వచ్చినా విరసం భావ జాలం తన మనసులోనుండి ఇంకా తొలగిపోలేదంటున్నాడు. అస్థిత్వ ఉధ్యమాలవల్ల సాహిత్యానికి కొత్త  భాష,  కొత్తచూపు వస్తుందంటున్న నగ్నముని ఆ ఉధ్యమాల  అవసరం ఉందంటున్నారు.   కానీ రచయితలు, కవులు సామాజిక సంక్షోభాన్నిగుర్తించడంలో విఫలమవుతున్నారని విచారం వ్యక్తం చేశారు.  సరైన విశ్లేషకులు(విమర్శ అనే పదం వాడడం నగ్నమునికి ఇష్టం లేదు) లేనందువల్లనే  తెలుగులోఉన్న గొప్ప సాహిత్యం వెలుగులోకి రావడం లేదన్నారు.   విశ్లేషకులు క్రూరంగాకాకుండా సున్నితంగా వ్యవహరిస్తే ఎవరితో ఎవరికీ పేచీవుండదంటుంన్నారు నాటినేటి కవి నగ్నముని.   తన కావ్యం   కొయ్యగుర్రం మీద జరిగిన చర్చ చాలా వరకుతనను అసహనానికి గురిచేసిందన్నారు.  అందులో చాలా వరకు ఒక కవిగా తనుఎత్తిచూపిన ‌సమస్య ‌కంటే అది కావ్యమా కాదా అనే అంశాలపైనే ఎక్కువ చర్చ జరిగిందన్నారు.   తను రాసిన విలోమ కథల మీదా కూడా సరైన విశ్లేషణా వ్యాసాలు రాలేదంటున్న నగ్నముని ఇంకేం చెప్తున్నారో వినండి.