Mar 28, 2022, 2:32 PM IST
ఆదిమ జాతికి చెందిన మాలి తెగకు చెందిన గిరిజనులు 27 మంది చిన్నారి బాలికలకు వివాహం కొరకు ఓని ఫంక్షన్ జరిపించారు. అయితే ఆదిమ జాతికి చెందిన మాలి తెగకు చెందిన గిరిజనలు పూర్వీకుల ఆచారం ప్రకారం ఐదు ఆరు సంవత్సరములు లోపు ప్రతి ఆడపిల్లకు తల్లిదండ్రులు తన వంతు బాధ్యతగా బంధుమిత్రులను పిలుచుకొని టెంట్లు వేసి భోజనం విందు ఏర్పాటు చేసి 20 రాటలు పందిరి తో ఒక్కొక్క రాట కి ఏడు కుండలు చొప్పున కట్టి మరికొన్ని రాటలకు 9 కుండలు కట్టి మధ్యలో ఉన్న రాటకు 11 కుండలు కట్టి పెద్దల సమక్షంలో పచ్చని తోరణాలతో పందిరి వేసి నేరేడు కొమ్మ లు మామిడి కొమ్మలు కట్టి ఆడపిల్లకు పెళ్లికూతురు ముస్తాబు చేసి పందిరి కింద కూర్చోబెట్టి హోమము పెట్టి వేదమంత్రాలతో తలపై నుంచి నీళ్లు పోస్తారు అలా చేయడం ద్వారా వారి పెద్దలు సాంప్రదాయ ప్రకారం ఆడపిల్లలకు ఘనంగా పెళ్లి జరిగినట్లు వీరు భావిస్తారు