పిల్లలు హైట్ పెరగడానికి ఎలాంటి ఫుడ్స్ అందించాలి?

Apr 16, 2022, 11:44 AM IST

ల్లలు వయసుకు తగ్గ ఎత్తు, బరువు ఉంటేనే బావుంటారు. ఇలా ఉండాలనే ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు ఎన్నోరకాల ఆహార పదార్థాలను తినిపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలు మాత్రం వయసు పెరుగుతున్నా.. హైట్ మాత్రం పెరగరు. అలాంటి పిల్లలకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది.  తోటిపిల్లల కంటే పొట్టిగా కనిపించే సరికి పిల్లలు మానసికంగా క్రుంగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు పొట్టిగా ఉండే పిల్లలను తోటి పిల్లలు వెక్కిరిస్తుంటారు. ఎగతాళి చేస్తుంటారు. దీనివల్ల పిల్లల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.