మ‌హాత్మా గాంధీతో క‌లిసి దండి మార్చ్ లో పాల్గొన్న ఏకైక క్రైస్తవుడు టైటస్ జి

మ‌హాత్మా గాంధీతో క‌లిసి దండి మార్చ్ లో పాల్గొన్న ఏకైక క్రైస్తవుడు టైటస్ జి

Published : Aug 21, 2022, 04:07 PM IST

మహాత్మా గాంధీ తన చారిత్రాత్మక దండి మార్చ్ లో వెంట వచ్చిన వారిలో ఓ క్రైస్త‌వుడు ఉన్నారు.

మహాత్మా గాంధీ తన చారిత్రాత్మక దండి మార్చ్ లో వెంట వచ్చిన వారిలో ఓ క్రైస్త‌వుడు ఉన్నారు. ఆయ‌నే  తెవర్తుండియిల్ టైటస్, 386 కిలోమీటర్ల పొడవైన ఈ యాత్రలో 81 మంది సత్యాగ్రహులలో ఉన్న ఒకే క్రైస్త‌వుడు ఆయ‌న‌. మనం స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నప్పుడు ఆయ పేరు పెద్ద‌గా గుర్తుచేసుకోవ‌డం లేదు.

టైటస్ కూడా ఇతర అంద‌రూ స‌త్యాగ్రహుల మాదిరిగానే తీవ్రమైన పోలీసు హింసను ఎదుర్కొన్నారు. సుమారు నెల రోజుల పాటు ఆయనను ఎరవాడ జైలులో బంధించారు. టైటస్ 1905లో ప్రస్తుత పథనంతిట్ట జిల్లాలోని కేరళలోని మరామన్ గ్రామంలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన ఆయ‌న..  పాఠశాల విద్య పూర్తయిన తరువాత టీచ‌ర్ గా ఎంపిక‌య్యారు. అయితే ఆయ‌నకు జీవితంలో గొప్ప లక్ష్యాలు ఉండేవి. చేతిలో అప్పు తీసుకున్న 100 రూపాయిలు ప‌ట్టుకొని ఉత్తర భారతదేశానికి వెళ్లేందుకు రైలు ఎక్కిన‌ప్పుడు అత‌డికి కేవ‌లం 20 ఏళ్లు మాత్ర‌మే ఉన్నాయి. సామ్ హిగ్గిన్బోథమ్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ లో చేరిన‌ప్పుడు ఖ‌ర్చుల కోసం పొలం ప‌నులు కూడా చేశారు.

అహ్మదాబాద్ లోని గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో ఒక డైరీ నిపుణుడిగా టైటస్ 1929 దీపావళి రోజున నియామ‌కం అయ్యాడు. గాంధీజీ ఆయ‌న‌ను ఇంట‌ర్వ్యూ చేశారు. ఆశ్రమంలో ఉన్న క‌ఠిన నిబంధ‌న‌లు ఆయ‌న కూడా పాటించేవారు. ఉప్పుపై బ్రిటిష్ గుత్తాధిపత్యాన్ని నిరసిస్తూ.. స్వాతంత్య్రం కోసం భారత జాతీయోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి గాంధీజీ నిర్వహించిన చారిత్రాత్మక దండి కవాతులో పాల్గొన్నందుకు ఆయన ఎంతో సంతోషించారు.

1937లో గాంధీ చివరిసారిగా కేరళను సందర్శించినప్పుడు అరన్ములాకు వెళ్ళే మార్గంలో మరామన్ వద్ద ఉన్న టైటస్ వృద్ధ తండ్రిని క‌లిశారు. భార‌త‌దేశానికి  స్వ‌తంత్రం త‌రువాత టైట‌స్ మ‌ధ్య‌ప్రదేశ్‌లోని భోపాల్‌లో వ్యవసాయ శాఖలో చేరారు. టైటస్ తన జీవితాంతం నిబద్ధతతో కూడిన గాంధేయవాదిగా ఉన్నారు. త‌న‌ 75 ఏళ్ల వయసులో 1980లో భోపాల్‌లో కన్నుమూశారు.

05:52 ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
00:20 సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
01:20బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం
03:35 AP- వ్యవస్థలను జగన్ నాశనం చేశారు- మంత్రి అచ్చెన్నాయుడు
04:00వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మా
02:46తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..
01:35కోతికి సీపీఆర్ చేసి బ్రతికించిన కానిస్టేబుల్.... కామెంట్ల తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..
02:08విమానంలో బాంబు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పరుగులు పెట్టిన ప్యాసింజర్.. చివరకు ఏమయ్యిందంటే..?
01:46రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం... అయినా తగ్గని కాంగ్రెస్ నేత...
02:06మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు..... మంచు లక్ష్మి మనసులో మాట బయటపెట్టిందిగా...