సుభాష్ చంద్ర బోస్ కి INA పగ్గాలను అందించిన రాశ్ బిహారి బోస్

సుభాష్ చంద్ర బోస్ కి INA పగ్గాలను అందించిన రాశ్ బిహారి బోస్

Published : Jul 08, 2022, 02:48 PM IST

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియ‌న్ నేష‌న‌ల్ ఆర్మీ (ఐఎన్ఏ)కి హృదయం, ఆత్మ అని అందరికీ తెలుసు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియ‌న్ నేష‌న‌ల్ ఆర్మీ (ఐఎన్ఏ)కి హృదయం, ఆత్మ అని అందరికీ తెలుసు. కానీ నేతాజీకి ఐఎన్‌ఏ పగ్గాలు అప్పగించింది  మాత్రం బెంగాల్ కు చెందిన మ‌రో బోస్‌.. ఆయ‌నే ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు రాష్ బిహారీ బోస్. ఆయ‌న 1886లో కలకత్తాలో జన్మించాడు. చిన్న‌నాటి నుంచి బ్రిటిష్ క్రూర‌త్వం, అణ‌చివేత చ‌ర్య‌ల‌ను చూసిన ఆయ‌న వారికి వ్య‌తిరేకంగా పోరాటం సాగించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. పరాయి పాలనను హింసాత్మకంగా పడగొట్టడాన్ని విశ్వసించిన బెంగాల్ విప్లవకారుల ఆరాధకునిగా మారాడు. ఆయ‌న ఫ్రాన్స్, జర్మనీల‌లో మెడిసిన్‌, ఇంజనీరింగ్ రెండింటిలో డిగ్రీలు తీసుకున్న అత్యంత ప్ర‌తిభావంతుడు. దీంతో ఆయ‌న సుల‌భంగానే విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌వ‌చ్చు. కానీ ఆయ‌న భార‌త స్వాతంత్య్ర ఉద్య‌మంలో చెర‌గ‌ని ముద్ర వేస్తూ.. ఆంగ్లేయుల‌కు వ్య‌తిరేకంగా విప్లవ పోరాటాన్ని సాగించారు. రాజ్ బిహారీ బోస్‌.. బెంగాలీ రివాల్షనరీలు, జుగంతర్ అనే సంస్థతో క‌లిసి పోరాటం సాగించారు. డిసెంబరు 23, 1912న ఢిల్లీలో గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై విఫలమైన సంచలనాత్మక హత్యాప్రయత్నం వెనుక కూడా బోస్ ఉన్నారు. 1915లో బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ లోపల భారత సైనికులు అడ్డుకున్న గద్దర్ తిరుగుబాటులో బోస్ ముందున్నారు. ఉత్తర అమెరికాకు చెందిన గద్దర్ పార్టీ ఈ తిరుగుబాటును నిర్వహించింది. విఫలమైన తిరుగుబాటు తరువాత, జాతీయవాదులు పెద్ద సంఖ్యలో అణచివేత‌కు గుర‌య్యారు. మొదటి లాహోర్ కుట్ర కేసులో విచారించబడ్డారు. బోస్ 1915లో లాలా లజపత్ రాయ్ సలహా మేరకు జపాన్‌కు పారిపోయాడు. భారత స్వాతంత్య్ర‌ పోరాటానికి జపాన్ మద్దతును నిర్వహించడం కోసం బోస్ తన జీవితాంతం గడిపాడు. అతను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆసియా ప్రతిఘటన ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి వివిధ ఆగ్నేయాసియా దేశాలలో పని చేయడానికి ఇండియా ఇండిపెన్స్ లీగ్‌ని స్థాపించాడు. రెండో ప్ర‌పంచ యుద్ధ కాలంలో జపాన్ ఆధీనంలో ఉన్న బ్రిటీష్ సైన్యంలోని భారతీయ సైనికులతో కూడిన ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేయడానికి జపాన్ సైన్యం మద్దతుతో కూడ‌గ‌ట్టాడు. 1943లో బోస్ సుభాష్ బోస్‌ను టోక్యోకు ఆహ్వానించి INA నాయకత్వాన్ని అప్పగించారు. బోస్ ఒక జపనీస్ మహిళను వివాహం చేసుకునీ, అక్క‌డి పౌరసత్వం పొందాడు. రెండవ అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 2వ ది ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్  అవార్డు అందుకున్న ఒక సంవత్సరం తర్వాత 1945లో టోక్యోలో మరణించారు.

05:52 ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
00:20 సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
01:20బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం
03:35 AP- వ్యవస్థలను జగన్ నాశనం చేశారు- మంత్రి అచ్చెన్నాయుడు
04:00వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మా
02:46తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..
01:35కోతికి సీపీఆర్ చేసి బ్రతికించిన కానిస్టేబుల్.... కామెంట్ల తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..
02:08విమానంలో బాంబు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పరుగులు పెట్టిన ప్యాసింజర్.. చివరకు ఏమయ్యిందంటే..?
01:46రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం... అయినా తగ్గని కాంగ్రెస్ నేత...
02:06మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు..... మంచు లక్ష్మి మనసులో మాట బయటపెట్టిందిగా...